రాజాసింగ్ BJP ఆఫీస్‌కు వచ్చి ఎన్ని రోజులైందో గుర్తుందా?.. ఏలేటికి కాంగ్రెస్ ఎమ్మెల్యే స్ట్రాంగ్ కౌంటర్

by Gantepaka Srikanth |

బీజేఎల్పీ(BJLP) నేత మహేశ్వర్ రెడ్డి(Maheshwar Reddy)పై కాంగ్రెస్ కీలక నేత, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Aadi Srinivas) సీరియస్ అయ్యారు.

రాజాసింగ్ BJP ఆఫీస్‌కు వచ్చి ఎన్ని రోజులైందో గుర్తుందా?.. ఏలేటికి కాంగ్రెస్ ఎమ్మెల్యే స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేఎల్పీ(BJLP) నేత మహేశ్వర్ రెడ్డి(Maheshwar Reddy)పై కాంగ్రెస్ కీలక నేత, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Aadi Srinivas) సీరియస్ అయ్యారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏలేటి వ్యాఖ్యలపై స్పందించారు. చిట్‌చాట్‌ల పేరుతో చెత్త వాగుడు వాడటం ఇకనైనా మహేశ్వర్ రెడ్డి ఆపాలని హితవు పలికారు. బీజేపీలో ఎన్ని లొసుగులు ఉన్నాయో అందరికీ తెలుసని అన్నారు. అసలు రాజాసింగ్(Raja Singh) ఆ పార్టీ కార్యాలయానికి వచ్చి ఎన్ని రోజులు అవుతుందో మహేశ్వర్ రెడ్డికి తెలుసా? అని ప్రశ్నించారు. ముందు బీజేపీలోని గొడవలు క్లియర్ చేసుకోవాలని అన్నారు.


పార్టీ అధ్యక్ష పదవి కోసం ఎంతలా కొట్టుకుంటున్నారో అందరూ చూస్తున్నారని అన్నారు. మీ పార్టీలో లొసుగులు పెట్టుకొని తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క గురించి మాట్లాడటం విడ్డూరంగా ఎందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువని.. అంత మాత్రాన విభేదాలు ఉన్నట్లు కాదని అన్నారు. తామంతా ఐకమత్యంగానే ఉన్నట్లు చెప్పారు. ఇకనైనా ఏలేటి మహేశ్వర్ రెడ్డి చిలక జోస్యాలు చెప్పడం ఆపేయాలని అన్నారు. లేకపోతే తాము ఏలేటి భవిష్యత్ చెబుతామని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా.. అంతకుముందు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మారారంటే.. ఇక మారేది ముఖ్యమంత్రేనని హాట్ కామెంట్స్ చేశారు. రాహుల్‌ గాంధీ టీమ్‌ నుంచి కొత్త ఇన్‌చార్జిని పంపించారు.. ఇప్పుడు కొత్త ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) ముందున్న టాస్క్‌.. రేవంత్ రెడ్డిని దింపేయడమే అన్నారు. ఆల్రేడీ ఆమె గ్రౌండ్‌ను మార్చుతూ రంగం సిద్ధం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులు ఉత్తమ్, భట్టి, పొంగులేటి కూడా ఎప్పుడెప్పుడు సీఎం సీటు ఖాళీ అవుతుందా..? అని ఎదురుచూస్తున్నారని ఆరోపించారు.

Next Story