మంత్రి కోమటి రెడ్డితో కాంగ్రెస్ లోక్ సభ చీఫ్ విప్ కె.సురేష్ భేటీ

by Ajay Maddhiboyina |

కేరళ రాష్ట్ర మావళికర సీనియర్ ఎంపీ, లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ కె.సురేష్ గురువారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు

మంత్రి కోమటి రెడ్డితో కాంగ్రెస్ లోక్ సభ చీఫ్ విప్ కె.సురేష్ భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేరళ రాష్ట్ర మావళికర సీనియర్ ఎంపీ, లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ కె.సురేష్ గురువారం రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఎర్రమంజిల్ లోనీ ఆర్ అండ్ బీ కార్యాలయంలో ఆయనతో సమావేశమై పలు అంశాలు చర్చించారు. కె.సురేష్ కేరళ నుంచి 8సార్లు ఎన్నికైన సీనియర్ లోక్ సభ సభ్యుడని, తను ఎంపీగా ఉన్నపుడు ఆయనతో పార్లమెంట్ లో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర మంత్రిగా ఆయనతో భేటీ సంతోషకరం అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు వంటి అంశాలపై ఇరువురు చర్చించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి భారంగా మారిందని,అయినా వెల్ఫేర్,డెవలప్మెంట్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎక్కడా తగ్గకుండా పనిచేస్తున్నామని తెలిపారు

Next Story