రేపు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం( సీఎల్పీ) సమావేశం.!

by Geesa Chandu |

ఈ నెల 18 న (ఆదివారం) సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం జరగనుంది.

రేపు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం( సీఎల్పీ) సమావేశం.!
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 18 న (ఆదివారం) సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం జరగనుంది. తెలంగాణ కోటాలో రాజ్యసభ స్థానానికి సీనియర్ నేత కే.కేశవరావు రాజీనామా చేయడంతో.. వచ్చే నెల 3 న ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అభ్యర్థిత్వాన్ని ఇటీవలే హై కమాండ్ కన్ఫర్మ్ చేసింది. దీంతో ఈ స్థానంలో అభిషేక్ ను గెలిపించుకోవడమే ప్రధాన ఎజెండాగా సీఎల్ఫీ సమావేశం కానుంది. దీంతో పాటు త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నకలపైన, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపైన మరియు సంక్షేమ పథకాలపైన చర్చకు రానున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా తెలంగాణ నుంచి.. తనను రాజ్యసభ అభ్యర్ధిగా అవకాశాన్ని కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డి కి అభిషేక్ సింఘ్వీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Next Story