నా ఫోన్ హ్యాక్ అయింది.. వరుస ఫోన్ హ్యాక్‌లతో గుబులు చెందుతున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు!

by Ramesh Naini |   (  Updated:2025-09-21 03:17:04  IST  )

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వరుసగా ఫోన్ హ్యాకింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి.

నా ఫోన్ హ్యాక్ అయింది.. వరుస ఫోన్ హ్యాక్‌లతో గుబులు చెందుతున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Telangana Congress) తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వరుసగా ఫోన్ హ్యాకింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. పలువురు ప్రముఖ నాయకుల మొబైల్ ఫోన్లు అనుమానాస్పదంగా (phone hack) హ్యాక్ అయ్యాయని ఆందోళన చెందారు. ఇటీవల కాంగ్రెస్ నేత, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఫోన్ హ్యాక్ అయిన విషయం తెలిసిందే. తను పంపినట్లుగా ఫేక్ మెసేజ్‌లు వెళ్తున్నాయని, ఎవరైనా నా పేరుతో డబ్బులు పంపమని అడిగితే పంపవద్దని, కనీసం రిప్లై కూడా ఇవ్వొద్దని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేయబోతున్నట్లు ఆయన ఇటీవల ఒక వీడియో విడుదల చేశారు.

టీపీసీసీ స్పోక్స్ పర్సన్, ఆర్యవైశ్య చైర్‌పర్సన్ కాల్వ సుజాత ఫోన్ కూడా హ్యాక్ అయినట్లు తాజాగా ఆమె ఒక వీడియో విడుదల చేశారు. నా ఫోన్ హ్యాక్ అయింది..ఫేస్‌బుక్, వాట్సాప్ హ్యాక్ చేశారని ఆమె చెప్పారు. నా ఫోన్ నెంబర్ నుంచి అందరికీ మెసేజులు వెళ్తున్నాయని, డబ్బులు అడుగుతున్నారని సూచించారు. దయచేసి నా పేరు చెప్పి ఎవరు డబ్బులు అడిగినా పంపొద్దని కాల్వ సుజాత తెలిపారు.

Next Story