- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని ముట్టడించిన కాంగ్రెస్ నాయకులు
మాజీ సీఎం, గజ్వెల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రాన్ని కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. గజ్వేల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు వ్యవసాయ క్షేత్రం వద్ద నిరసనకు దిగారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం, గజ్వెల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రాన్ని కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. గజ్వేల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు వ్యవసాయ క్షేత్రం వద్ద నిరసనకు దిగారు. కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి గజ్వేల్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాట్లాడాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి రావా గజ్వేల్ ప్రజలవి ఓట్లు కావా.. ఫామ్ హౌస్ పాలన.. వద్దురా నాయనా.. అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరవాత కేసీఆర్ ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇటీవల అసెంబ్లీకి వచ్చిన ఆయన పది నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండకుండా సంతకం పెట్టి అక్కడ నుండి తిరిగి వెళ్లిపోయారు. అంతకుముందు కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని నదీ జలాల విషయంపై మాట్లాడతారని అంతా అనుకున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా సైతం కేసీఆర్ రాకపై ఎంతో హైప్ ఇచ్చింది కానీ కేసీఆర్ ఏమీ మాట్లాడకుండా వెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి. పదవి పోకుండా ఉండేందుకే వచ్చి సంతకం చేసి వెళ్లారనే ఆరోపణలు కూడా వచ్చాయి.






