- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PV Narasimha Rao: పీవీ ఘాట్‌లో నివాళి అర్పించిన కాంగ్రెస్ నేతలు.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
వచ్చే జయంతి లోపు వంగర గ్రామంలో పీవీ నరసింహారావు మెమోరియల్ పూర్తి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే జయంతి లోపు వంగర గ్రామంలో పీవీ నరసింహారావు (PV Narasimha Rao) మెమోరియల్ పూర్తి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని వీవీ నరసింహారావు 104 వ జయంతి సందర్భంగా హైదారబాద్‌లోని వీవీ ఘాట్ వద్ద పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. భారతదేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తెచ్చి యావత్ ప్రపంచానికే పీవీ మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు.
దేశ ఆర్థిక రంగంలో ఆయన చేసిన సేవలు మరువలేనివని చెప్పుకొచ్చారు. విద్యారంగం బలోపేతం ఆయనతోనే సాధ్యమైందన్నారు. పీవీ తీసుకున్న అనేక గొప్ప నిర్ణయాలు భావితరాలకు ఆదర్శం.. అలాంటి గొప్ప వ్యక్తిని వ్యక్తిగతంగా కలిసే అవకాశం నాకు అనేకసార్లు దక్కిందని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha), సీనియర్ నేత వీ. హనుమంతరావు (VH) తదితరులు పాల్గొన్నారు.






