- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేతల మీడియా సమావేశం..ఉన్నతాధికారులు సీరియస్
by Ajay Maddhiboyina |
ఈ నెల 17వ తేదీన వేల్పూరులో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు

X
దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 17వ తేదీన వేల్పూరులో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు సవాళ్లు ప్రతిసవాళ్లు చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. బాల్కండ కాంగ్రెస్ నేతలను ఆర్మూర్ పాత పోలస్ స్టేషన్ తరలించగా వాళ్లు అక్కడే మీడియా సమావేశం నిర్వహించారు.
దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో, జిల్లాలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. పోలీస్ స్టేషన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు చేశారు. పోలీస్ టోపీలను టేబుల్ పై మర్చిపోయిన ఇద్దరు సిబ్బందిని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌కు పోలీస్ కమిషనర్ అటాచ్ చేశారు.
Next Story






