- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నేను రేవంత్ రెడ్డి పేరు మర్చిపోలేదు’.. కాంగ్రెస్ నేత వివరణ
‘జై జగత్’ అనేది కాంగ్రెస్(Telangana Congress) నినాదమని తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ బెల్లయ్య నాయక్(Bellaiah Naik) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ‘జై జగత్’ అనేది కాంగ్రెస్(Telangana Congress) నినాదమని తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ బెల్లయ్య నాయక్(Bellaiah Naik) అన్నారు. శనివారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినట్లు కొందరు కావాలనే కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నా వ్యాఖ్యలను వక్రీకరించి వ్యక్తిగతంగా తనకు, పార్టీకి డ్యామేజ్ చేసేలా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారని అన్నారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం ఐఏసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) తొలిసారిగా తెలంగాణకు వచ్చారు. నూతన ఇన్‌చార్జిగా గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది.
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(PCC President Mahesh Kumar Goud) అధ్యక్షతన ఏర్పాటైన ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రులు, కీలక నేతలు అందరూ హాజరయ్యారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ.. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులే కాకుండా సామాన్య కార్యకర్తల నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకోవడం బాగుందని హర్షం వ్యక్తం చేశారు. చివరగా ప్రసంగం ముగిస్తూ ‘జై జగన్’ అంటూ ఆయన నినాదం చేశాడని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.






