కాంగ్రెస్ నేతలను దేశ ద్రోహులన్నారు.. మంత్రి ఉత్తమ్ ఘాటు వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

‘ఆపరేషన్ సిందూర్’‌ (Operation Sindoor)లో భాగంగా ఎన్ని ఎయిర్‌క్రాఫ్ట్స్ (Aircrafts) కూలిపోయాయని ప్రశ్నించగా.. విదేశాంగ శాఖ ఇప్పటి వరకు సరైన సమాధానం చెప్పలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు.

కాంగ్రెస్ నేతలను దేశ ద్రోహులన్నారు.. మంత్రి ఉత్తమ్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆపరేషన్ సిందూర్’‌ (Operation Sindoor)లో భాగంగా ఎన్ని ఎయిర్‌క్రాఫ్ట్స్ (Aircrafts) కూలిపోయాయని ప్రశ్నించగా.. విదేశాంగ శాఖ ఇప్పటి వరకు సరైన సమాధానం చెప్పలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌తో భారత అద్భుత విజయం సాధించిందని వారికి అభినందనలు తెలిపారు. పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (POK)లో ఉగ్రవాదుల స్థావరాలపై ఖచ్చితమైన దాడులు జరిగాయని అన్నారు.

యుద్ధంలో రాఫెల్ ఎయిర్‌క్రాఫ్ట్ (Rafael Aircraft) కూలిపోయిందా అని అడినందుకు కాంగ్రెస్ (Congress) నేతలను దేశ ద్రోహులంటూ విమర్శించారని ఫైర్ అయ్యారు. అయితే, సీడీఎస్ అనిల్ చౌహాన్ CDS Anil Chauhan) రాఫెల్ కూలిపోయింది నిజమేనని వెల్లడించారని.. ఇప్పుడు అయన కూడా దేశద్రోహేనా.. అని ప్రశ్నించారు. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉత్పత్తిలో ఆలస్యం జరుగుతోందంటూ ఎయిర్ మార్షల్ చెప్పారని.. ఇదే విషయమై రాహుల్ గాంధీ తాను పార్లమెంట్‌ (Parliament)లో మాట్లాడామని అన్నారు. ఇన్‌టైమ్‌లో ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ డెలివరీ చేయడంలో హాల్ ఫెయిలైందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇన్‌టైంలో ప్రొడక్షన్ పూయ్యేలా చర్చలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వాస్తవానికి ఏడాదికి హాల్ (HAL) 24 ఎయిర్ క్రాఫ్ట్స్‌లు ఉత్పత్తి చేయాలని అది సాధ్యపడటం లేదన్నారు. మేధావులంతా రక్షణ రంగంలో రావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలపునిచ్చారు.

Next Story