- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించి ముందుకెళ్తాం'
by GSrikanth |
దిశ, వెబ్‌డెస్క్: సెప్టెంబర్ 4వ తేదీన పెరిగిన ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో విస్తృతంగా పోరాటం చేస్తామని మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీలక నేత వీ. హనుమంతరావు అన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సెప్టెంబర్ 4వ తేదీన పెరిగిన ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో విస్తృతంగా పోరాటాలు చేస్తామని మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీలక నేత వీ. హనుమంతరావు అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి బీజేపీ ప్రభుత్వం పెంచుతోన్న ధరల వివరాలను ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. పెరిగిన ధరలపై ప్రజల దృష్టిని మరల్చేందుకే రాష్ట్రంలో బీజేపీ మత ఘర్షణలు సృష్టిస్తోందని మండిపడ్డారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించి ముందుకు వెళ్తామని అన్నారు. రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం రావాలంటే అందరూ కలిసి పనిచేయాలని కోరారు.
Next Story






