- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈటల రాజేందర్‌ను ఊసరవెల్లితో పోల్చిన షబ్బీర్ అలీ
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మునుగోడు ఉపఎన్నిక సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు రూ.25 కోట్లు ఫండింగ్ ఇచ్చారని ఈటల చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. తాజాగా.. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. ఈ సందర్భంగా ఈటలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్‌ను ఊసరవెల్లిగా అభివర్ణించారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు ఈటల పార్టీలు మార్చారని దుయ్యబట్టారు. బీజేపీలో చేరికల కోసం నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు. కోట్లు ఇస్తాం బీజేపీలోకి రావాలంటూ దిగజారి అడుగుతున్నారని ఆయన వెల్లడించారు. అటు ఈటల రాజేందర్ కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి, ఈటల మధ్య ఫైట్ గట్టిగనే జరుగుతోంది. ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు.






