- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రేవంత్ పదిహేనేళ్లు సీఎంగా ఉండాలి’.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత స్పందన
రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముఖ్యమంత్రిగా 10-15 సంవత్సరాలు ఉండాలని కొల్లాపూర్ ప్రజలు కోరుకున్నారని.. అదే మాటలను సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్(Sampath Kumar) అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముఖ్యమంత్రిగా 10-15 సంవత్సరాలు ఉండాలని కొల్లాపూర్ ప్రజలు కోరుకున్నారని.. అదే మాటలను సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్(Sampath Kumar) అన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే తమ జిల్లా పెండింగ్ పనులు అవుతాయని సభకు వచ్చిన ప్రజలు కోరుకున్నారు. జనం చెప్పిన దాన్నే సీఎం సభలో చెప్పారని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అధిష్టానం చూసుకుంటుదని తెలిపారు. కేటీఆర్ మాటలు రోజు రోజుకూ సృతిమించుతున్నాయని, కేటీఆర్ నీ పుస్తకంలో ఒక పేజీ మాత్రమే చదివాం. ఇంకా చాలా కథ ఉందని హెచ్చరించారు. ‘రావుగారి రాసలీలలు, కల్వకుంట్ల కథాకమిస్ట్, తారక్ తోడేలు’ అనే మూడు పుస్తకాలు ఉన్నాయని అన్నారు. సమయం వచ్చినప్పుడు ఈ పుస్తకాలను బయటపెడుతామన్నారు. కేటీఆర్ నీకంటే ఎక్కువ బాష మాట్లాడగలను కాని నీవు తట్టుకోలేవని మండిపడ్డారు. లోకేష్‌ను కలవలేదంటావ్, కలిస్తే తప్పేంటి అని నువ్వే అంటావ్.. రేవంత్ రెడ్డి మొనగాడు, మొగాడు కాబట్టే మిమ్మల్ని మట్టి కరిపించాడుని పేర్కొన్నారు. సీఎంను ఉద్దేశించి మాట్లాడే పద్దతి నేర్చుకో కేటీఆర్ అంటూ సూచించారు.






