- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కవిత కథ ముగిసింది.. నెక్ట్స్ హరీష్ రావుది మిగిలి ఉంది: కాంగ్రెస్
బీఆర్ఎస్‌లో మాజీ మంత్రి హరీష్‌రావు ఏక్నాథ్షిండేగా మారే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్‌లో మాజీ మంత్రి హరీష్‌రావు ఏక్నాథ్షిండేగా మారే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌పై ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి కామెంట్స్‌పై రామ్మోహన్ రెడ్డి స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోతాయని జోస్యం చెప్పారు. ఈఆరోజు కవిత, రేపు హరీష్ రావు ఇలా ఒక్కొక్కరుగా గొంతు విప్పి బయటకు వస్తారని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ త్యాగం చేసి మరీ బీజేపీ ఫేవర్ చేసిందని.. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ కవిత తన లేఖలో క్లియర్‌గా చెప్పారని అన్నారు. అందుకే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు అభ్యర్థులనే నిలబెట్టలేదు.. బీజేపీని గెలిపించడానికి ప్రయత్నం చేశారని తెలిపారు. తెర ముందు మాత్రమే కోడి పుంజల మాదిరిగా కోట్లాడుకుంటుంటారు.. తెరవెనుకాల వీళ్లు దోస్తానం అందరికీ తెలిసిపోయిందని విమర్శించారు.






