మంత్రి సీతక్కపై ఆరోపణలు.. కాంగ్రెస్ నేత సస్పెండ్

by Ajay Maddhiboyina |

మంత్రి సీత‌క్క‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డంతో కాంగ్రెస్ నేత‌ను స‌స్పెండ్ చేశారు. ఆసిఫాబాద్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ అభ్య‌ర్థి రావి శ్రీనివాస్

మంత్రి సీతక్కపై ఆరోపణలు.. కాంగ్రెస్ నేత సస్పెండ్
X

దిశ‌, వెబ్ డెస్క్: మంత్రి సీత‌క్క‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డంతో కాంగ్రెస్ నేత‌ను స‌స్పెండ్ చేశారు. ఆసిఫాబాద్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ అభ్య‌ర్థి రావి శ్రీనివాస్ సోష‌ల్ మీడియాలో సీత‌క్క‌కు వ్య‌తిరేకంగా పోస్టులు పెట్టారు.దీంతో సీత‌క్క త‌న‌కు వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టార‌ని ఆరోపిస్తూ శ్రీనివాస్ పై కాంగ్రెస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు. సీతక్కతో పాటు ఆసిఫాబాద్ డీసీసీ విశ్వప్రసాద్ సైతం శ్రీనివాస్ తీరుపై ఫిర్యాదు చేశారు. సీతక్క, విశ్వప్రసాద్ ఫిర్యాదు మేరకు రావి శ్రీనివాస్‌ను పార్టీ నుండి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా రావి శ్రీనివాస్ పనిచేశారని కూడా ఆరోపణలు వచ్చాయి.

Next Story