బీజేపీ కావాలనే బీసీ రిజర్వేషన్‌లను అడ్డుకుంటోంది: మహేష్ కుమార్ గౌడ్

by Ajay Maddhiboyina |

టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ ఉద్దేశ‌పూర్వ‌కంగానే బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను అడ్డుకుంటోంద‌ని అన్నారు. యావ‌త్ కాంగ్రెస్ నాయ‌క‌త్వం వెళ్లి ఢిల్లీలో రిజ‌ర్వేష‌న్ల కోసం ధ‌ర్నా చేసింద‌ని అయినా కూడా బీజేపీకి క‌నువిప్పు క‌ల‌గ‌లేద‌ని అన్నారు.

బీజేపీ కావాలనే బీసీ రిజర్వేషన్‌లను అడ్డుకుంటోంది: మహేష్ కుమార్ గౌడ్
X

దిశ‌, వెబ్ డెస్క్: టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ ఉద్దేశ‌పూర్వ‌కంగానే బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను అడ్డుకుంటోంద‌ని అన్నారు. యావ‌త్ కాంగ్రెస్ నాయ‌క‌త్వం వెళ్లి ఢిల్లీలో రిజ‌ర్వేష‌న్ల కోసం ధ‌ర్నా చేసింద‌ని అయినా కూడా బీజేపీకి క‌నువిప్పు క‌ల‌గ‌లేద‌ని అన్నారు. ఉద్దేశ్య‌పూర్వ‌కంగానే బీజేపీ బీసీల‌కు 42శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లును అడ్డుకుంటోంద‌ని చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తి లేకుండా చ‌ట్ట ప్ర‌కారం బీసీల‌కు 42శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేయ‌లేని ప‌రిస్థితి ఉంద‌న్నారు.

కాంగ్రెస్ పార్టీ చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేద‌ని, బీసీ సంఘాలు అర్థం చేసుకోవాల‌ని అన్నారు. అన్ని ప్ర‌య‌త్నాలు చేశామ‌ని, ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకువ‌చ్చామ‌ని అన్నారు. అయిన‌ప్ప‌టికీ కూడా బీజేపీ ఆపుతోంద‌ని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 42శాతం రిజ‌ర్వేష‌న్లు ఇచ్చే ప్ర‌క్రియ‌ను ఆప‌లేద‌ని తెలిపారు. ఎన్నిక‌లు జ‌రిగినా జ‌ర‌గ‌క‌పోయినా 42శాతం రిజ‌ర్వేష‌న్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నం కొన‌సాగుతూనే ఉంటుంద‌ని అన్నారు. బీసీ రిజ‌ర్వేషన్ కు కాంగ్రెస్ క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీజేపీ గెల‌వ‌డం ఒక క‌ల అని వ్యాఖ్యానించారు. గ్రామాల్లో స‌ర్పంచులు లేక పాల‌న కుంటుప‌డుతోంద‌ని చెప్పారు.

Next Story