- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ముగ్గురు సీఎంలు రివేంజ్ పాలిటిక్స్ చేయలేదు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jaggareddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jaggareddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. కక్ష సాధింపు చర్యలకు తాను వ్యతిరేకం అని అన్నారు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy), కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy), కొణిజేటి రోషయ్య(Konijeti Rosaiah)లు ఎప్పుడూ రివేంజ్ పాలిటిక్స్(Revenge Politics) చేయలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు నష్టం చేయాలని చూసినా సరే కానీ.. నేను ఎవరికీ నష్టం చేసేలా మాత్రం ప్రవర్తించను అని అన్నారు. కానీ తప్పకుండా రాజకీయ యుద్ధం మాత్రం చేస్తా అని సంచలన ప్రకటన చేశారు.
అధికారంలో ఉన్నప్పుడు రాజకీయం చేసిన వారు.. అధికారం పోయాక తప్పకుండా బాధపడాల్సిన పరిస్థితి వస్తుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. నాతో సహా డబ్బులు ముట్టుకోకుండా రాజకీయం చేయని నేత ఎవరూ ఉండరు అని అన్నారు. రాజకీయాలకు తప్పకుండా డబ్బు అవసరం అని తెలిపారు. ప్రతీకార రాజకీయాలు చేయడం సరికాదు. తెలంగాణ ప్రజల రక్తంలో కక్షసాధింపు ఉండదు అని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి కారణం హరీష్ రావు అని తెలిపారు. తనను ఓడించేందుకు హరీష్ రావు చాలా కష్టాపడ్డారని అన్నారు. ఆయన నియోజకవర్గం మీద కంటే ఎక్కువ ఫోకస్ నా నియోజకవర్గం మీద పెట్టి.. వ్యూహాలు పన్ని నా విజయావకాశాల మీద దెబ్బకొట్టారని వెల్లడించారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ ఓడిపోయారు. బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ చేతిలో జగ్గారెడ్డి ఓటమి చెందారు.






