- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ గాంధీ, రేవంత్ చెప్పినా వినను.. జగ్గారెడ్డి సంచలన నిర్ణయం
రాహుల్ గాంధీ, రేవంత్ చెప్పినా వినను.. జగ్గారెడ్డి సంచలన నిర్ణయం

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయను అని ప్రకటించారు. ఆయన భార్య నిర్మలను బరిలోకి దింపుతున్నట్లు స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi), రేవంత్ రెడ్డి(Revanth Reddy) వచ్చి మాట్లాడినా నా నిర్ణయం ఇక మారదు అని కుండబద్దలు కొట్టి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విధేయులకే ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇతర పార్టీల్లో గెలిచిన వారిని చేర్చుకోను అని వెల్లడించారు. కాగా, తెలుగు రాజకీయాల్లో జగ్గారెడ్డి పరిచయం అక్కర్లేని వ్యక్తి.. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఆయన ఏది మాట్లాడిన అది పెద్ద బ్రేకింగ్ అయిపోద్ది.. అలాంటి జగ్గారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయ వర్గాలో పెద్ద చర్చకు దారి తీశాయి.






