- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలిగిన తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత.. ఆ సదస్సులో గందరగోళం
భూభారతి(Bhu Bharati) అవగాహన సదస్సులో గందరగోళం నెలకొంది. వేదిక పైకి ఆహ్వానించలేదని ఏఐసీసీ(AICC) కార్యదర్శి సంపత్ కుమార్(Sampath Kumar) అలిగివెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: భూభారతి(Bhu Bharati) అవగాహన సదస్సులో గందరగోళం నెలకొంది. వేదిక పైకి ఆహ్వానించలేదని ఏఐసీసీ(AICC) కార్యదర్శి సంపత్ కుమార్(Sampath Kumar) అలిగివెళ్లిపోయినట్లు తెలుస్తోంది. వేదికపైకి గద్వాల ఇన్‌చార్జి సరిత, తిరుపతయ్యను ఆహ్వానించలేదని ఆమె వర్గీయులు సైతం ఆందోళన చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సదస్సుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ మల్లు రవి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ప్రతీసారి మంత్రుల పర్యటనలను అడ్డుకోవడం సరికాదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు ఎమ్మెల్యే(MLA) పార్టీ కండువా వేసుకొని స్టేజ్ పైకి వెళ్లాలని, ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ సరిత వర్గీయులు నినాదాలు చేశారు. ప్రతిసారి మమ్మల్ని అవమానాలకు గురి చేస్తున్నారని మల్లు రవి ముందు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. సమావేశం మొదలైనప్పటి నుంచి మంత్రి పొంగులేటి మాట్లాడే వరకు కార్యకర్తలు వారి ప్రసంగాలకు అడ్డు తగులుతూనే వచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడే సమయంలో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.






