బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలు.. హైడ్రాకు కాంగ్రెస్ నేత కంప్లైంట్

by Gantepaka Srikanth |

బఫర్ జోన్ పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్న భవన నిర్మాణాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ నేత షాహెద్ అన్సారీ హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలు.. హైడ్రాకు కాంగ్రెస్ నేత కంప్లైంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బఫర్ జోన్ పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్న భవన నిర్మాణాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ నేత షాహెద్ అన్సారీ హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం, మణికొండ నెఖ్నంపూర్ గ్రామంలో ని సర్వే నెం: 53, 53, 54/ఎలోని లేక్ వ్యూ కాలనీలోని ప్లాట్ నెం: 3 వద్ద గల 375 చదరపు గజాల స్థలంలో అక్రమంగా గ్రౌండ్ ప్లస్ 2 అంత స్తులతో కూడిన విల్లాలు, వ్యక్తి గత నివాస భవనాల నిర్మాణాన్ని వెంటనే నిలిపేయాలని కోరారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒక వైపు హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలు తొలగిస్తుండగా, జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం భవన నిర్మాణదారులతో కుమ్మక్కై బఫర్ జోన్‌లో సైతం నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తూ, అక్రమార్కులను వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఇటీవల కాలంలో నగరంలోని సరస్సులు, ఉద్యానవనాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ప్రశంసిచారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో అన్యాక్రాంతమైన కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాలు కాపాడారని గుర్తు చేశారు. నెఖ్నంపూర్లో బఫరోజోన్ పరిధిలోని లేక్వ్యూ కాలనీలో అక్రమ నిర్మాణాలను అడ్డుకుని, జీహెచ్ఎంసీ అధికారులు జారీ చేసిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Next Story