- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Feroze Khan: మహిళా కమిషన్ ముందు ఫిరోజ్ ఖాన్ హాజరు.. తను చేసిన వ్యాఖ్యలపై వివరణ
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన శుక్రవారం (Telangana Women's Commission) తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద (Nerella Sharada) సమక్షంలో ఫిరోజ్ ఖాన్ (Feroz Khan) తను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఈ క్రమంలోనే కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
కాగా, కాంగ్రెస్ నేత మొహమ్మద్ ఫిరోజ్ ఖాన్, జూన్ 21న గాంధీ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు జూలై 4న విచారణకు వచ్చి వివరణ ఇవ్వాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. తను చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి.. విచారణలో భాగంగా ఆయన వ్యాఖ్యలు మహిళల పరువుకు నష్టం కలిగించాయని మహిళా కమిషన్ భావించింది.






