పార్టీ ఏది చెప్తే అది చేస్తా.. అజారుద్దీన్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)పై కాంగ్రెస్ నేత, మాజీ హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్(Azharuddin) కీలక వ్యాఖ్యలు చేశారు.

పార్టీ ఏది చెప్తే అది చేస్తా.. అజారుద్దీన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)పై కాంగ్రెస్ నేత, మాజీ హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్(Azharuddin) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఉప ఎన్నిక టికెట్ రేసులో నేను ఉన్నాను. లేను అని నేను అనడం లేదు. కానీ.. ఇప్పటివరకు పీసీసీ(PCC)లో ఉప ఎన్నికపై, బరిలో నిలిపే అభ్యర్థిపై మాత్రం ఎలాంటి చర్చ జరగలేదు. దానికి ఇంకా టైముంది కాబట్టి.. ఇప్పటినుంచే పార్టీ హడావిడి చేయదలుచుకోలేదు. దాని వల్ల కేడర్ కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పార్టీకి ఏం చేయాలో తెలుసని అజారుద్దీన్ అన్నారు. పార్టీ ఏది చెప్తే అది చేయడానికి తాను సిద్ధమని ఈ సందర్భంగా అజారుద్దీన్ ప్రకటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ బై పోల్ అనివార్యంగా మారింది. ఆర్నెళ్లలోపు ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా ఎన్నిక ఏకగ్రీవం కాబోతుందా? సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఎలాంటి ఎత్తులు వేయబోతున్నదనేది? కంటోన్మెంట్ మాదిరిగా కాంగ్రెస్ కైవసం చేసుకోనుందా?, బీజేపీ, ఎంఐఎం వ్యూహాలేంటనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నుంచి తానే అభ్యర్థిగా ఉంటానని అజారుద్దీన్ చెబుతుండటం హాట్ టాపిక్‌గా మారుతోంది.

Next Story