నాకు కేంద్రమంత్రి పదవి రాకుండా అడ్డుకుంది ఈ కొడుకులే.. సొంత నేతలపై అంజన్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-24 11:14:01  IST  )

తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్(Anjan Kumar Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు.

నాకు కేంద్రమంత్రి పదవి రాకుండా అడ్డుకుంది ఈ కొడుకులే.. సొంత నేతలపై అంజన్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్(Anjan Kumar Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఆదర్శనగర్‌లో యాదవ సామాజికవర్గ నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కులగణన చేపట్టి బీసీ కులాల లెక్కలు తేల్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ధన్యవాదాలు చెప్పారు. రాహుల్ గాంధీ మాట ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కులగణన ప్రక్రియ పూర్తి చేశారు. అందుకే యాదవుల తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పేందుకు సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. ఆమె పాత్ర ఏం లేదు అన్నవాళ్లు ఇవాళ కులగణను తప్పుల తడక అంటే ఎవరు నమ్ముతారు అని అన్నారు.

సికింద్రాబాద్ పార్లమెంట్(Secunderabad Parliament) ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాంగ్ డిసిషన్ తీసుకున్నది. నిజానికి ఈ సీటును కాంగ్రెస్ పార్టీ యాదవు(Yadav)లకు కేటాయిస్తే తప్పకుండా గెలిచేది. యాదవులకు ఇవ్వకుండా పార్టీలోనే కొందరు అడ్డు తగిలారు. యాదవ కులస్తులను కాంగ్రెస్ పార్టీలోని కొందరు ఇప్పటికీ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు.. తన కొడుకు పార్టీకి చేసిన సేవలను గుర్తించి రాజ్యసభ సీటు ఇచ్చింది. తనకు నేరుగా సోనియా, లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళు చెప్పడంతోనే పీసీసీలో చోటు ఇచ్చారని అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ పీసీసీ, మాజీ ఎంపీగా చేసినా ఎక్కడ స్వయంగా నిలబడి ఎన్నికల్లో గెలిచింది లేదని వీహెచ్‌ను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు.

పార్లమెంట్ ఎన్నికల్లో ఇంట్లో కూర్చున్న వ్యక్తిని తీసుకొచ్చిన సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చి చేజేతులా సీటు కోల్పోయేలా చేశారంటూ దానం నాగేందర్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ భజనగాళ్ళు (రెడ్లు) ఇవ్వలేదు. సోనియా గాంధీతో మాట్లాడి నన్ను లాలూ ప్రసాద్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాడు. అప్పుడు కూడా నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రాకుండా ఉత్తమ్, జగ్గారెడ్డి అడ్డు తగిలారు. నాకు కేంద్ర మంత్రి కాకుండా అడ్డుకుంది కూడా ఈ కొడుకులే (రెడ్లు) అంటూ ఓ సామాజికవర్గంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాళ్లంతా ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. మళ్లీ ఎంపీగా టికెట్ తెచ్చుకొని పోటీ చేస్తారు.. మనకు టికెట్ ఇవ్వమంటేనేమో ఇవ్వరు అంటూ మండిపడ్డారు. ఇక నుంచి యాదవ సామాజికవర్గాన్ని తక్కువ చేసి చూసినా, పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఊరుకునే ప్రసక్తే లేదని రెచ్చిపోయారు.

Next Story