పేదలకు ఉపయోగపడే అనేక పథకాలను కాంగ్రెస్ తీసుకొచ్చింది: ఆది శ్రీనివాస్

by Ajay Maddhiboyina |

పేద‌ల‌కు ఉపయోగ‌ప‌డే అనేక ప‌థ‌కాల‌ను కాంగ్రెస్ తీసుకువ‌చ్చింద‌ని ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గ‌రీబీ హ‌టావో నినాదం, పేద ప్ర‌జ‌ల‌కు పోడు భూముల పంపిణీ, బ్యాంకుల జాతీయీక‌ర‌ణం, ఇళ్లు లేనివారికి ఇందిర‌మ్మ ఇల్లు ఇవ్వ‌డం,

పేదలకు ఉపయోగపడే అనేక పథకాలను కాంగ్రెస్ తీసుకొచ్చింది: ఆది శ్రీనివాస్
X

దిశ, వెబ్ డెస్క్: పేద‌ల‌కు ఉపయోగ‌ప‌డే అనేక ప‌థ‌కాల‌ను కాంగ్రెస్ తీసుకువ‌చ్చింద‌ని ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గ‌రీబీ హ‌టావో నినాదం, పేద ప్ర‌జ‌ల‌కు పోడు భూముల పంపిణీ, బ్యాంకుల జాతీయీక‌ర‌ణం, ఇళ్లు లేనివారికి ఇందిర‌మ్మ ఇల్లు ఇవ్వ‌డం, ఉపాధిహామీ లాంటి అనేక ప‌థ‌కాల‌ను తీసుకువ‌చ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వ‌చ్చిన‌ప్పుడే గ్రామీణ‌ప్రాంతాల్లో ప్ర‌తి గ‌డ‌ప‌కూ సంక్షేమ ప‌థ‌కాలు చేరాయ‌ని చెప్పారు. కానీ గ‌త ప‌న్నెండు సంవ‌త్స‌రాలుగా భార‌త దేశాన్ని ప‌రిపాలిస్తున్న బీజేపీ దేశాన్ని భాషా ప్ర‌యుక్త రాష్ట్రాలుగా విడదీయాల‌ని చూస్తోంద‌న్నారు.

మ‌తాల ప్ర‌తిప‌దిక‌న ప్ర‌జ‌లను విడ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని ఆరోపించారు. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను ప్రైవేటు ప‌రం చేస్తుంద‌ని చెప్పారు. ఎంతోమంది పేద ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతున్న ఉపాధిహామీ ప‌థ‌కం పేరు నుండి మ‌హాత్మాగాంధీ పేరును తొల‌గించింద‌ని మండిప‌డ్డారు. ఇలా బీజేపీ దేశంలో గంద‌ర‌గోళానికి తెర‌తీసే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని కానీ పేద ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ఏ కార్య‌క్ర‌మాన్ని చేయ‌డంలేద‌ని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడే దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చింద‌ని, కాంగ్రెస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలోనే తెలంగాణ ప్ర‌త్యేక‌రాష్ట్రంగా ఏర్ప‌డింద‌ని చెప్పారు.

Next Story