- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నామినేషన్ అనంతరం కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో ఎమ్మెల్సే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) కోసం నామినేషన్ (Nomination) ప్రక్రియ ముగిసింది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఎమ్మెల్సే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) కోసం నామినేషన్ (Nomination) ప్రక్రియ ముగిసింది. కాంగ్రెస్ పార్టీ (Congress Party) తరుపున ఎంపికైన అభ్యర్ధులు అద్దంకి దయాకర్ (Addanki Dayakar), కేతావత్ శంకర్ నాయక్ (Kethavath Shankar Naik), విజయశాంతి (Vijayashanthi) నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పట్ల కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలపై పలు కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన.. నాకు ఈ అవకాశం రావడంతో చాలా మంది వాళ్ల ఇంట్లో బిడ్డకు వచ్చినట్టు ఆనంద పడుతున్నారని, నేను చేసిన సేవలకు ప్రజలు ఇచ్చిన గుర్తింపుగా భావిస్తున్నానని తెలిపారు. నాకు ఈ అవకాశం లేట్ గా వచ్చినా ప్రజలకు సేవ చేయడానికి పార్టీ ఇచ్చిన అదనపు బాధ్యతగా చూస్తున్నానని అన్నారు. అలాగే ఒక వేళ ఎమ్మెల్సీగా (MLC) అవకాశం ఇవ్వకపోయినా కూడా ప్రజల కోసం పోరాడేవాడినని, ప్రజలతో లేకపోతే తాను బతకలేనని వ్యాఖ్యానించారు. మంత్రిగా (Minister) అవకాశం దక్కుతుందనేది ప్రస్తుతానికి వార్తలు (News) మాత్రమేనని ప్రజల్లో నాపై ఉన్న అభిమానం కొద్దీ అలా అంటున్నారని, మంత్రి పదవి అనేది అధిష్టానం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం (Social Justice) జరుగుతుందని, అందుకే ఉద్యమకారులైనా తనకు, విజయశాంతికి అవకాశం దక్కిందని తెలిపారు. ఎమ్మెల్సీ అయ్యాక మండలిలో ప్రతిపక్షాల (Oppositions) సలహాలు (Suggetions), ప్రజల సమస్యలు (Public Problems) ప్రభుత్వం (Government) దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం (Solve) దిశగా అడుగులు వేస్తామని అద్దంకి అన్నారు. కాగా తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఆదివారం అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురికి అవకాశం దక్కగా.. మరొకటి మిత్రపక్షమైన సీపీఐ (CPI) కేటాయించింది.






