Addanki Dayakar: అందుకే కేటీఆర్, హరీష్ రావు విషం చిమ్ముతున్నారు

by Gantepaka Srikanth |

కులగణనను బీఆర్ఎస్(BRS) నేతలు అడ్డుకోవాలని చూస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్(Addanki Dayakar) ఆరోపించారు.

Addanki Dayakar: అందుకే కేటీఆర్, హరీష్ రావు విషం చిమ్ముతున్నారు
X

దిశ, వెబ్‌డెస్క్: కులగణనను బీఆర్ఎస్(BRS) నేతలు అడ్డుకోవాలని చూస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్(Addanki Dayakar) ఆరోపించారు. మంగళవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను విమర్శించడం బీఆర్ఎస్‌కు అలవాటుగా మారిందని అన్నారు. కులగణన జరిగితే ఆర్థిక, సామాజిక విషయాలు బయటపడతాయని అనుంటున్నారని తెలిపారు. కావాలనే కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై హరీష్ రావు(Harish Rao), కేటీఆర్‌(KTR)లు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. కులాలపై బీఆర్ఎస్ వైఖరేంటో అర్థమవుతోందని అన్నారు. జనగణన జరిగితే రిజర్వేషన్ల విషయంలోనే కాకుండా.. రాష్ట్రంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా క్లారిటీ వస్తుందని అన్నారు. అందుకే ప్రభుత్వం ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిందని తెలిపారు.

Next Story