- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ అంటేనే కరెంట్.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
విద్యుత్ సిబ్బంది పడిన శ్రమను తాను కళ్లారా చూశానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: విద్యుత్ సిబ్బంది పడిన శ్రమను తాను కళ్లారా చూశానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. ఇవాళ ఖమ్మం (Khammam)లో ఆయన ఎలక్ట్రికల్ అంబులెన్స్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చిన సమయంలో ధైర్య సాహసాలతో విద్యుత్ సిబ్బంది ప్రాణాలకు తెగించి అప్పటికప్పుడు స్తంభాలు ఎక్కి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారని గుర్తు చేశారు. అప్పుడే వారి శ్రమను తాను కళ్లారా చేశానని పేర్కొన్నారు. విద్యుత్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి నిత్యం శ్రమిస్తూనే ఉంటానని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.కోటి బీమా చేయించామని తెలిపారు. కాంగ్రెస్ వస్తే.. కరెంట్ ఉండదని కొందరు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్ అని అన్నారు. ముందుచూపుతో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయగలిగేది కాంగ్రెస్ మాత్రమేనని తెలిపారు. గత ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం ఏ పరిశ్రమను నెలకొల్పిన దాఖలాలు లేవని, తాము అధికారంలోకి వచ్చాక రూ.లక్ష కోట్లతో పంప్డ్ స్టోరేజీ. సోలార్ ప్రాజెక్టులన ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.






