- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ రిజర్వేషన్ బిల్లుపై భారీ పోరాటానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్.. యాక్షన్ ప్లాన్ ఇదే
సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) ప్రత్యేక సమావేశం అయిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) ప్రత్యేక సమావేశం అయిన సంగతి తెలిసిందే. దాదాపు గంటన్నరపాటు సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన రాష్ట్రవ్యాప్త పాదయాత్ర, శ్రమదాన కార్యక్రమాలను యధావిధిగా నిర్వహిస్తారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఆగస్టు 5 నుంచి 7 వరకు జరుపనున్న పోరాట కార్యాచరణను ఈ సమావేశంలో ప్రకటించింది. ఆగస్టు 5న పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ప్రవేశపెడతారు. ఆగస్టు 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొంటారు. ఆగస్టు 7న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుల ఆమోదం కోసం వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు చట్టబద్దతపై కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.






