- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kishan Reddy : కాంగ్రెస్ సైనికులను అవమానిస్తోంది : కిషన్ రెడ్డి
కాంగ్రెస్ జైహింద్ ర్యాలీ(Congress Jaihind Rally), సభల పేరుతో దేశ సైనికులను(Indian Army) అవమానిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ జైహింద్ ర్యాలీ(Congress Jaihind Rally), సభల పేరుతో దేశ సైనికులను(Indian Army) అవమానిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) మండిపడ్డారు. నేడు మీడియా సమావేశంలో మాట్లాడిన కిషన్ రెడ్డి.. ప్రజల ఆకాంక్షల మేరకే ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) చేపట్టామని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack)కి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ప్రాజెక్ట్ చేపట్టిందని అన్నారు. పాకిస్తాన్, POKలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసి,100 మందికి పైగా ఉగ్రవాదులను అంతం చేసిందని.. దేశ ప్రజలు ఏదైతే కోరుకున్నారో అదే ప్రధాని మోడీ చేశారని కిషన్ పేర్కొన్నారు.
ఈ ఆపరేషన్ రహస్యంగా జరిగినది కాదని, దేశమంతా దీనిని సమర్థిస్తోందని.. అయితే కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాత్రం ఈ ఆపరేషన్‌ను, భారత సైనిక శక్తిని తక్కువ చేసేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ దేశ భద్రతను అవమానిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఆపరేషన్ సిందూర్‌కు ముందు పాకిస్తాన్‌కు సమాచారం ఇచ్చారని, దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాక్ అనుకూలంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మోదీ ట్రంప్ ఒత్తిడితో యుద్ధం ఆపారని, పీవోకే తీసుకునే శక్తి బీజేపీకి లేదని అనడం.. సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేసారు.






