అన్ని పథకాల్లో కాంగ్రెస్ స్కాములు చేస్తోంది.. ఎంపీ ధర్మపురి అర్వింద్ హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ పథకాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్కాములకు పాల్పడుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) సంచలన ఆరోపణలు చేశారు.

అన్ని పథకాల్లో కాంగ్రెస్ స్కాములు చేస్తోంది.. ఎంపీ ధర్మపురి అర్వింద్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ పథకాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్కాములకు పాల్పడుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తప్పడు హామీలతో కాంగ్రెస్ (Congress) రాష్ట్రంలో దొడ్డిదారిన అధికారంలో వచ్చిందని ఫైర్ అయ్యారు. ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ సర్కా్ర్ కుట్రలను ప్రజలకు గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో భీకర వర్షాలకు పంటలు నష్టపోయిన రైతన్నలు, వరద బాధితులను ఇప్పటి వరకు ఆదుకోకపోవడం దారుణమని కామెంట్ చేశారు. ఇక పొరుగు రాష్ట్రంలో కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ (Almatti Dam) ఎత్తు పెంచేందకు భూ సేకరణకు ఆదేశాలు జారీ చేసి నిధులు విడుదల చేసినా.. తెలంగాణ ప్రభుత్వ పెద్దల్లో ఏమాత్రం చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వ అవినీతిలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వాటాలు పొంది.. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు విషయంలో మౌనం వహిస్తున్నారని ధర్మపురి అర్వింద్ ఆరోపించారు.

Next Story