- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ సమావేశం.. అభ్యర్థి ఎంపికపై కీలక నిర్ణయం!
జూబ్లీహిల్స్ బై పోల్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ బై పోల్ (CM Revanth Reddy) స్టేట్ పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ఈ ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో భారీ సంచలనాలు నమోదు కాబోతున్నాయనే ఊహాగానాల రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ సెగ్మెంట్ లో విజయం కోసం ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే నియోజకవర్గంలో మోహరించిన బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress Party) పార్టీలు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంతాప సభల ద్వారా బీఆర్ఎస్ ప్రజల వద్దకు వెళ్తుంటే అభివృద్ధి, సంక్షేమం ఆధారంగా అధికార కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది. సిట్టింగ్ స్థానం కోసం బీఆర్ఎస్, అడిషనల్ సీటు కోసం కాంగ్రెస్, ఈసారి గెలుపు మాదేనంటూ బీజేపీ చేస్తున్న రాజకీయ ఎత్తులు జూబ్లీహిల్స్ తెలంగాణ పొలిటికల్ సినారియో రసవత్తరంగా మారుస్తున్నాయి.
సాయంత్రం సీఎం కీలక సమావేశం:
ఈ క్రమంలో రాష్ట్రంలో తమకు ప్రజాధరణ ఉందని నిరూపించడంతో పాటు, రాష్ట్ర రాజకీయాల్లో తమదే అప్పర్ హ్యాండ్ అని నిరూపించుకునేందుకు అధికార కాంగ్రెస్ భావిస్తోంది. కంటోన్మెంట్ బై ఎలక్షన్ మాదిరిగానే జూబ్లీహిల్స్ ను సైతం తమ ఖాతాలో వేసుకునేందుకు హస్తం పార్టీ సీరియస్ గా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి (Jubilee Hills By Poll) ఇవాళ సాయంత్రం 6 గంటలకు కీలక సమావేశం నిర్వహించబోతున్నట్లు సమాచారం. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులతో సీఎం చర్చించి ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయబోతున్నట్లు టాక్. బీఆర్ఎస్ అభ్యర్థి దాదాపు ఖరారు అయ్యారనే ప్రచారం నేపథ్యంలో ఈ ఇవాళ్టి మీటింగ్ లో అభ్యర్థి విషయంలో సీఎం పార్టీ నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీలను ఢీకొట్టేలా సీఎం రేవంత్ రెడ్డి ఎవరిని బరిలోకి దింపబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది.
ముగ్గురు మంత్రులతో ప్రయోగం:
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముగ్గురు మంత్రులతో ప్రయోగం చేస్తోంది. ఈ నియోజకవర్గాన్ని మూడు విభాగాలుగా విభజించిన హస్తం పార్టీ ఒక్కో మంత్రికి రెండు డివిజన్ల చొప్పున కేటాయించింది. మంత్రులకు సహాయంగా 18 మంది కార్పొరేషన్ల చైర్మన్లను కేటాయించి సంక్షేమ, అభివృద్ధే అస్త్రాలుగా బీఆర్ఎస్, బీజేపీని (BJP) కట్టడికి వ్యూహరచన చేస్తోంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ షెడ్యూల్ ఖరారు కాక ముందే ఈ సెగ్మెంట్ రాజకీయం స్టేట్ లెవల్ లో రచ్చ రేపుతుంటే ఇక పోలింగ్ తేదీ వివరాలు అనౌన్స్ అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య బిగ్ ఫైట్ తప్పదనే చర్చ జరుగుతోంది.






