Etala Rajender : కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదు : ఈటల రాజేందర్

by Muthe.Rajitha |   (  Updated:2025-02-08 14:44:27  IST  )

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు(Delhi Asssembly Election Results) నేడు వెలువడ్డాయి.

Etala Rajender : కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదు : ఈటల రాజేందర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు(Delhi Asssembly Election Results) నేడు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కాగా బీజేపీ సాధించిన ఈ అఖండ విజయంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(BJP MP Etala Rajender) హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ ప్రజలు ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. ఢిల్లీ ఎన్నికల్లో మూడుసార్లు గెలిచిన కేజ్రీవాల్(Kejriwal).. ఆ పార్టీ నేతలు బాగుపడ్డారు గాని, ప్రజలు మాత్రం బాగుపడలేదని అన్నారు. తీవ్రమయిన కాలుష్యంలో దేశ రాజధాని కొట్టుమిట్టాడుతోందని.. ఇందుకోసం ఆప్ ఏమీ చేయలేదని మండిపడ్డారు. లిక్కర్ స్కాం(Liqueur Scam)లో అడ్డంగా దొరికిపోయి.. ఆప్(AAP) నాయకుల బాగోతం బట్టబయలు అయిందని.. వారిని ఇక ఎన్నడూ ప్రజలు నమ్మరని అన్నారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే.. ఆ పార్టీకి భవిష్యత్తు అనేది లేదని, రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో విఫలం అయ్యారని మండిపడ్డారు. తెలంగాణలో ఒక్క ఏడాదిలోనే కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, త్వరలోనే ఢిల్లీ ఫలితాలు తెలంగాణ(Telangana)లో రిపీట్ కానున్నాయని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

Next Story