- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Praveen Kumar : ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ కోల్పోయింది : ఆర్.ఎస్ .ప్రవీణ్ కుమార్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)ఏడాదిలోనే ప్రజా విశ్వాసం(Public Trust) కోల్పోయింద(Been Lost)న్న సంగతి ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ ల పోల్ లో వెల్లడైనందునా వెంటనే అసెంబ్లీని రద్ధు చేసి ఎన్నికలు జరుపాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్(R.S. Praveen Kumar)డిమాండ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)ఏడాదిలోనే ప్రజా విశ్వాసం(Public Trust) కోల్పోయింద(Been Lost)న్న సంగతి ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ ల పోల్ లో వెల్లడైనందునా వెంటనే అసెంబ్లీని రద్ధు చేసి ఎన్నికలు జరుపాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్(R.S. Praveen Kumar)డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నిర్వహించినట్లుగా భావిస్తున్న ప్రజాభిప్రాయ పోల్ ను ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
తెలంగాణ కాంగ్రెస్ కు ఇప్పటికైనా జనం గుండె చప్పుడు తెలుసుకోవాలని జ్ఞానోదయం కలిగినందుకు సంతోషమని.. వారు ప్రజలను మరిన్ని ప్రశ్నలు ఇంకా డైరెక్టుగా అడిగి ఉంటూ సమూలంగా తుడిచిపెట్టుకు పోయామన్న వాస్తవం వారికి తెలిసేదన్నారు. ఒక ఏడాదిలోనే ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిన దృష్ట్యా గత సంవతర్సంలో ఫ్రాన్సులో అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రాన్, శ్రీలంక లో రానిల్ విక్రమసింఘే చేసినట్లుగా ఎన్నికు నిర్వహించాలని..ప్రజలు వాళ్లకు ఎవరు కావాలో నిర్ణయించుకుంటారన్నారు. గత ఏడాదిగా మీరు దోచుకున్న తెలంగాణ ప్రజల ఆస్తుల వివరాలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నిజాయితీ గా వెల్లడిస్తే కొంత మేరకు క్షమాభిక్ష (Voluntary Disclosure Scheme)లభిస్తుందని..దోపిడీ సొమ్మును పక్క రాష్ట్రాలకు తరలిస్తే సీఐడిని పెట్టి అటాచ్ చేయాల్సి వస్తదని తెలిపారు.
ఇక నుండైనా ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడం మానుకోండని.. పోలీసులారా జాగ్రత్తగా గమనించండని..రోజులన్నీ ఒకేలా ఉండవని ఆర్ఎస్పీ హితవు పలికారు. ప్రజా విశ్వాసం కోల్పోయిందని తెలిసిన నేపథ్యంలో గాంధీ భవన్ ను ఖాళీ చేసి ప్రజోపయోగం కోసం మ్యూజియంగా మార్చండని, పాస్ పోర్ట్ లు రెన్యువల్ చేసుకొని రడీగా ఉండండని..ఎందుకంటే మిమ్ముల ప్రజలు మీ ఊర్లల్లో ఉండనివ్వక పోవచ్చని..అప్పుడు సచివాలయం నుండి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు షార్ట్ కట్ రూట్ చూసుకోండని ఎద్దేవా చేశారు. సీఎంను మార్చడం లాంటి వ్యర్థ ప్రయత్నాలు చేయకండని..మీ గంజాయి బ్యాచ్ లో తులసి మొక్కలు ఉండే అవకాశమే లేదని..ఈ ఆప్షన్ చరిత్రలో మీకెప్పుడూ వర్కవుట్ కాలేదన్నారు.
అలాగే కామారెడ్డి, చేవెళ్ల, ఇంద్రవెల్లి, తుక్కుగూడ, సరూర్ నగర్, వరంగల్ లలో మోసం మెమోరియల్ స్థూపాలకు శంకుస్థాపనలు చేయడం మరచి పోకండని ఎద్దేవా చేశారు. ప్రజా విశ్వాసం కోల్పోయారని తేలినందునా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఒక విప్లవాత్మక ప్రసంగం చేసి తన సాహసోపేత నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
కాగా తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నాంటూ నెట్టింటా పోల్ పెట్టారని..అందులో ఫామ్ హౌస్ పాలన కు 67%, ప్రజల వద్దకు పాలనకు 33% అనుకూలంగా ప్రజాతీర్పు వచ్చినట్లుగా వైరల్ అవుతున్న ట్వీట్ ను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రవీణ్ కుమార్ విమర్శలు చేశారు.






