- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy : కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి చేర్చింది ఆర్టీసీ అన్నలే : సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏర్పాటయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా జరుపుతున్న ప్రజా పాలన విజయోత్సవాల్లో(Triumph of public governance) మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) పాల్గొన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏర్పాటయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా జరుపుతున్న ప్రజా పాలన విజయోత్సవాల్లో(Triumph of public governance) గురువారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ చేసిన ఉద్యమం కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులు జంగ్ సైరన్ మోగించి, ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లారని అన్నారు. కార్మికుల ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చకుండా మోసం చేసింది గత ప్రభుత్వం. వారి హక్కుల కోసం పోరాడిన ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం వారిని పరామర్శించేందుకు ఒక్క బీఆర్ఎస్ నేతలు వెళ్లలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీలను ప్రజల్లోకి బస్సుల ద్వారా తీసుకువెళ్ళిన ఆర్టీసీ అన్నలకు కాంగ్రెస్ పార్టీ సదా రుణపడి ఉంటుందని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించామని పేర్కొన్నారు. గత పాలకులు ఆర్టీసీని నష్టాల్లోకి నెడితే.. తాము రూ.4 వేల కోట్లు ఆర్టీసీకి మహాలక్ష్మి పథకం సబ్సిడీని మంజూరు చేసి, సంస్థను లాభాల పట్టించాము. మహాలక్ష్మి పథకం ద్వారా.. చదువుకునే ఆడబిడ్డలకు, చిరు ఉద్యోగాలు చేసే అక్కలకు చెల్లెళ్లకు నెలకు ఆరు, ఏడు వేలు ఆదా అవుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలియ జేశారు.
- Tags
- CM Revan Reddy






