Bandi Sanjay : కాంగ్రెస్‌ హామీలే ఓటమికి టికెట్‌: బండి సంజయ్

by Y. Venkata Narasimha Reddy |

కాంగ్రెస్‌ హామీలే ఓటమికి టికెట్‌ అని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)ఎక్స్ వేదికగా చురకలేశారు.

Bandi Sanjay : కాంగ్రెస్‌ హామీలే ఓటమికి టికెట్‌: బండి సంజయ్
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్‌ హామీలే ఓటమికి టికెట్‌ అని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)ఎక్స్ వేదికగా చురకలేశారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక(Delhi Assembly Election)ల్లో కాంగ్రెస్ హామీ(Congress Promises)ల ప్రచార పోస్టర్ల విడుదలపై స్పందించిన బండి సంజయ్ కాంగ్రెస్ తెలంగాణలో ఇచ్చిన మోసపూరిత హామీలతో ఎన్నికలకు వెళ్లి హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు.

ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఘనమైన వాగ్దానాలు తెలంగాణలో కాంగ్రెస్ హామీల మాదిరిగానే విఫలమవ్వడం ఖాయమన్నారు. విద్యా భరోసా కార్డు, రూ. 15,000 రైతు భరోసా, రూ. మహిళలకు 2,500, రూ. 4,000 పెన్షన్లు, ఇంటి స్థలాలు, మద్ధతు ధర, అంతర్జాతీయ పాఠశాలలు? అన్నీ ఖాళీ పదాలు..హామీలేనని బండి సంజయ్ కాంగ్రెస్ ఎన్నికల హామీలపై విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ బూటకపు ప్రచారాలు, బూటకపు హామీలతో ఢిల్లీ(ప్రజలు) తప్పుదోవ పట్టదని...కాంగ్రెస్ కు మరో ఓటమి ఎదురుచూస్తోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

Next Story