కార్మిక సంక్షేమం కోసం కాంగ్రెస్ ​ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి వివేక్ వెంకటస్వామి

by Ramesh Naini |

కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ పేదల పక్షాన నిలుస్తుందని, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలైన కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్​వెంకట స్వామి తెలిపారు.

కార్మిక సంక్షేమం కోసం కాంగ్రెస్ ​ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి వివేక్ వెంకటస్వామి
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ పేదల పక్షాన నిలుస్తుందని, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలైన కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్​వెంకట స్వామి తెలిపారు. గిగ్ వర్కర్లు ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న అగ్రిగేటర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఆదివారం మంత్రిని గిగ్​వర్కర్లు నివాసంలో కలిసి, రాష్ట్ర అసెంబ్లీలో గిగ్ వర్కర్ల చట్టం ఆమోదించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ ప్లాట్‌ఫాం ఆధారిత గిగ్ వర్కర్స్ చట్టం - 2026 ఆమోదం పొందింది. ఇది గిగ్ వర్కర్ల హక్కులు, సంక్షేమానికి ఒక చారిత్రాత్మక ముందడుగు అని వర్కర్లు అన్నారు. అనంతరం మంత్రి వివేక్​ మాట్లాడుతూ, ఈ చట్టం అమలు, బలోపేతం కోసం రాబోయే రోజుల్లో మరింత కృషి అవసరమని, సమాజంలోని చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ చట్టంతో లక్షలాది కుటుంబాలు లాభపడతాయని, రాబోయే రోజుల్లో మరింత మంది దీనిలో చేరుతారని పేర్కొన్నారు.

Next Story