- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ ప్రభుత్వానికి మిగిలింది 999 రోజులే : బీజేపీ
కాంగ్రెస్పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిపై తమ పార్టీ మరింత గట్టిగా పోరాడేందుకు సిద్ధమైన్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రకటించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిపై తమ పార్టీ మరింత గట్టిగా పోరాడేందుకు సిద్ధమైన్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ‘ఇగ సహించదు తెలంగాణ, సేవ్తెలంగాణ’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ పేరిట 99 రోజుల కార్యాచరణను ప్రకటించిందని,ఈ ప్రభుత్వానికి ఇంకా 999 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఎన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య, ప్రజావ్యతిరేక, వైఫల్య పాలనకు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో పోరుబాట ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఈనెల 16న మండల కేంద్రాల్లో బీజేపీ కార్యకర్తలు మండల ఎమ్మార్వోలకు వినతిపత్రాలు సమర్పిస్తారని, 20న జిల్లా కేంద్రాల్లో అన్ని కలెక్టరేట్ల ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. తదుపరి కార్యక్రమాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు రైతు భరోసా అందడం లేదని, పేద ప్రజలకు ఇళ్లు ఇవ్వడం లేదని, వృద్ధులకు పెన్షన్లు సకాలంలో పంపిణీ చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసేలా ఈ పోస్టర్‌ను రూపకల్పన చేసినట్లు తెలిపారు.






