Congress: సర్పంచ్ ఎన్నికలకు బ్రేక్.. డీసీసీల ఎంపికపై కాంగ్రెస్ ఫోకస్

by Prasad Jukanti |   (  Updated:2025-10-11 13:08:58  IST  )

Congress: సర్పంచ్ ఎన్నికలకు బ్రేక్.. డీసీసీల ఎంపికపై కాంగ్రెస్ ఫోకస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‍తో ఆగిన డీసీసీల ఎంపిక పక్రియ మళ్లీ తెరపైకి వచ్చింది. లోకల్ బాడీ ఎన్నికల విషయంలో హైకోర్టు బ్రేకులు వేయడంతో కాంగ్రెస్ అధిష్టానం ఇక డీసీసీల ఎంపికపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. డీసీసీల ఎంపిక (DCC selection) కోసం గతంలో ఏఐసీసీ నియమించిన 22 మందితో కూడిన అబ్జర్వర్ల టీమ్ జిల్లాల్లో పర్యటిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే తమకు కేటాయించిన జిల్లాలకు చేరుకున్న అబ్జర్వర్ల (AICC Observers) కమిటీ.. పీసీసీ కమిటీ సభ్యులతో కలిసి డీసీసీల విషయంలో ఆశావహుల నుంచి దరఖాస్తులు, జిల్లా నాయకుల అభిప్రాయాలను సేకరిస్తోంది. వారం రోజుల పాటు ఈ పర్యటనలు కొనసాగనున్నాయి.

డీసీసీలకే కీ రోల్:

రాబోయే రోజుల్లో పార్టీలో డీసీసీలతే కీలక పాత్ర కాబోతోందని ఏఐసీసీ ఇప్పప్పటికే ప్రకటించింది. స్థానిక ఎన్నికలు, ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపికలో డీసీసీలు కీలకం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని సమర్థవంతంగా నడిపించగల సత్తా కలిగిన సమర్థులైన డీసీసీల కోసం హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇవాళ ఖమ్మంలో ఏఐసీసీ అబ్జర్వర్ మహేంద్రన్ పర్యటించారు. ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 18 వరకు ఆసక్తి కలిగిన నేతలు దరఖాస్తులు చేసుకోవాలని వచ్చిన దరఖాస్తులను తాము క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఏఐసీసీ కార్యాలయానికి పంపిస్తామన్నారు. అక్కడ పార్టీ పెద్దలు డీసీసీలను నియమిస్తారని చెప్పారు. పార్టీ పెద్దల సమక్షంలో జరగనున్న ఈ నియామకాలు పారదర్శకంగా ఉంటాయన్నారు.

Next Story