మళ్లీ యాక్టీవ్.. ఉత్తర తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్!

by Disha Web Desk 2 |
మళ్లీ యాక్టీవ్.. ఉత్తర తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్​నగర్​జిల్లాల్లో బలంగా ఉన్నామనే విశ్వసిస్తున్న కాంగ్రెస్​పార్టీ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తన ప్రభావం చూపాలని భావిస్తున్నది. ఈ మేరకు పార్టీ బలోపేతంపై ప్రణాళిక మొదలైంది. దీనిలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలపై ఫోకస్​పెట్టింది. ఆయా జిల్లాలను అనుసంధానం చేస్తూ పాదయాత్రలు నిర్వహించనున్నది. ఇప్పటికే ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్​ఏలేటి మహేశ్వర్​రెడ్డి భైంసా నుంచి పాదయాత్రను షురూ చేయగా, దీనిలో సీనియర్లందరూ భాగస్వామ్యం అవుతున్నారు. దీనికి అనుసంధానంగా భట్టి విక్రమార్క పాదయాత్ర కూడా మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నది. బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్​ప్రాంతాలలో పాదయాత్ర కొనసాగుతూ మంచిర్యాలలోభారీ బహిరంగ సభను పెట్టాలని కాంగ్రెస్​పార్టీ నిర్ణయం తీసుకున్నది. దాదాపు లక్ష మందితో పెట్టాలని పార్టీ ప్లాన్​చేస్తున్నది. రాహుల్​గాంధీని చీఫ్​గెస్టుగా తీసుకురావాలని కాంగ్రెస్​సీనియర్​నేతలంతా రెడీ అయ్యారు. ఇప్పటికే ఏఐసీసీకి ప్రపోజల్ కూడా పంపినట్లు ఓ నేత తెలిపారు.

ఎందుకీ నిర్ణయం..?

ఉత్తర తెలంగాణ ప్రాంతాలలోని జిల్లాల్లో కాంగ్రెస్​కేడర్​ఉన్నప్పటికీ, లీడర్లలో సమన్వయం లేక పార్టీ నష్టపోయినట్లు టీపీసీసీ వర్గం భావిస్తున్నది. దీంతో జిల్లాల వారీగా లీడర్లను మళ్లీ యాక్టీవ్ చేస్తూ పార్టీ బలోపేతం కోసం సీనియర్లు సమిష్ఠిగా కృషి చేయాలని ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. సీనియర్లతో కొత్త ఇంచార్జీలు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని టీపీసీసీ సూచించనున్నది. అంతేగాక సోషల్​మీడియా టీమ్‌లు, ప్రచార కమిటీలు, బూత్​లెవల్ కమిటీలతోనూ పాదయాత్రలకు వచ్చే నేతలు భేటీ కానున్నారు. పార్టీ పరిస్థితులపై ఆరా తీస్తూనే.. భవిష్యత్ ప్లాన్‌పై రూపకల్పన చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల ఇంచార్జీలతో నివేదికలు తయారు చేపించి, ఢిల్లీ అధిష్టానానికి పంపించనున్నారు.a


Next Story