కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ షురూ.. పాలకుర్తి నేతల ఫిర్యాదులపై వాడివేడి చర్చ!

by Kema Shiva Kumar |

గాంధీభవన్‌లో పాలకుర్తి నియోజవర్గ పరిధిలోని నాయకుల కుమ్ములాటలపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ప్రారంభమైంది.

కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ షురూ.. పాలకుర్తి నేతల ఫిర్యాదులపై వాడివేడి చర్చ!
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌లో పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ప్రారంభమైంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, స్థానిక పార్టీ నేతల మధ్య తలెత్తిన వివాదాలు, పరస్పర ఫిర్యాదులపై కమిటీ సుదీర్ఘంగా చర్చిస్తోంది.

పాలకుర్తిలో వర్గ పోరు.. పరస్పర ఫిర్యాదులు

పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో గత కొంతకాలంగా సాగుతున్న అంతర్గత విభేదాలు ఈ భేటీతో తాజాగా క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చాయి. పార్టీ నాయకురాలు ఝాన్సీరెడ్డిపై పాలకుర్తి స్థానిక కాంగ్రెస్ నేతలు హరిప్రసాద్, కృష్ణకిషోర్ కమిటీకి ఫిర్యాదు చేశారు. అంతుకు ప్రతిగా సదరు నేతలు హరిప్రసాద్, కృష్ణ కిషోర్‌లపై పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో పాటు ఝాన్సీరెడ్డి కూడా క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు సమర్పించారు. ప్రస్తుతం గాంధీభవన్‌లో జరుగుతున్న ఈ కమిటీ సమావేశంలో ఇరు వర్గాల నుంచి అందిన ఫిర్యాదులపై, అక్కడ నెలకొన్న పరిస్థితులపై మల్లు రవి నేతృత్వంలోని కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఈ సమావేశం అనంతరం కమిటీ ఓ నిర్ణయానికి వచ్చే చాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

Next Story