తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ చేసిందేమీ లేదు: కవిత

by Malleboina Mahesh |

తెలంగాణ జాగృతి కార్యాలయంలో విలీన దినోత్సవం కార్యక్రమం జరిగింది.

తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ చేసిందేమీ లేదు: కవిత
X

దిశ, వెబ్ డెస్క్: సెప్టెంబర్ 17 సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పార్టీలు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ జాగృతి కార్యాలయం (Telangana Jagruti Office)లో విలీన దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 ముమ్మాటికి తెలంగాణ విలీన దినోత్సవమేనని చెప్పుకొచ్చారు. అలాగే తెలంగాణ చరిత్రను బీజేపీ వక్రీకరిస్తుందని, ఫెడరల్ స్ఫూర్తికి బీజేపీ వ్యతిరేకమని, మత విద్వేషాలను బీజేపీ రెచ్చగొడుతోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని, మోడీపై ప్రేమ లేకపోతే దుష్ప్రచారం ఆపాలని, కేంద్ర ప్రభుత్వానికి తమ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు చేయవద్దని సీఎం లేఖ రాయాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు.

ఆనాటి పోరాటంలో స్వయంగా పాల్గొన్న జనగాం ప్రాంతానికి చెందిన ఎం.కె మొయినుద్దీన్ ఇక్కడ ఉన్నారు. ఆస్తిని కూడా వదులుకొని దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. వారికి మా తాత రాఘవేంద్రరావు గారు కూడా సహకారం అందించారు. ఇలాంటి పోరాట యోధున్ని గౌరవించుకోవడం నాతో పాటు జాగృతి సభ్యుల అదృష్టంగా భావిస్తున్నా. సెప్టెంబర్ 17 అంటే భారత్‌లో విలీనమైన రోజుగానే భావిస్తాం. ఇక్కడి గంగా, జమున తెహజీబ్ సంస్కృతిని సెలబ్రేట్ చేసుసునే రోజు గానే చూస్తాం. తెలంగాణ జాగృతి నుంచి మత విద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా కవిత చెప్పుకొచ్చారు.

Next Story