National Herald CASE: రాహుల్ ఇమేజ్ ఓర్వలేక మోడీ సర్కార్ కుట్రలు: మహేశ్ కుమార్ గౌడ్

by Prasad Jukanti |

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది.

National Herald  CASE: రాహుల్ ఇమేజ్ ఓర్వలేక మోడీ సర్కార్ కుట్రలు: మహేశ్ కుమార్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: నేషనల్ హెరాల్డ్ కేసులో (National Herald CASE) ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ (ED) ఛార్జ్ షీట్ లో చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. గన్ పార్క్ నుంచి బషీర్ బాగ్ ఈడీ కార్యాలయం వరకు భారీగా పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. అనంతరం ఈడీ కార్యాలయం ముందు బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నా లో ఏఐసీసీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud).. దేశ వ్యాప్తంగా బీజేపీ ఫాసిస్టు పాలన కొనసాగిస్తోందని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఇమేజ్ ఓర్వలేక మోడీ సర్కార్ అక్రమ కేసుల కుట్రలకు తెరలేపిందన్నారు. తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియాలనే ఈ ధర్నా కార్యక్రమం చేపట్టామన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ హెరాల్డ్ కు రూ.90 కోట్లు రుణం ఇస్తే మనిలాండరింగ్ జరిగినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకి సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరగలేదన్నారు.

మోడీ హవా తగ్గుతున్న క్రమంలో రాహుల్ గాంధీ ఇమెజ్ ను బద్నాం చేసేందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారని గాంధీ కుటుంబం ఏనాడు కేసులకు భయపడింది లేదన్నారు. రాహుల్ గాంధీ ఒక ఫైటర్ అని ఆయన దేశ ప్రజల గొంతుక అన్నారు. కుల గణనతో రాహుల్ గాంధీ మోడీకి రాజకీయ మరణ శాసనం రాశారని బీహార్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఎన్నికలు రాగానే ప్రతి పక్షాలపై ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను వాడడం మోడీ, అమిత్ షాకు అలవాటుగా మారిందన్నారు. గుజరాత్ లో ఏఐసీసీ సమావేశాలతో బీజేపీ నేతల్లో వణుకు మొదలైందన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు చేసిందని స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నవారు బీజేపీ పార్టీలో ఒక్కరైనా ఉన్నారా అని ప్రశ్నించారు.

Next Story