- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులను పొట్టబెట్టుకున్న ఘనత కాంగ్రెస్ కే దక్కుతుంది : ఎంపీ ఈటెల
స్వరాష్ట్రం కోసం 1969 లో తెలంగాణ సమాజం, విద్యార్ధిలోకం ఆనాడు ఉద్యమాలు చేసిందని ఎంపీ ఈటెల రాజేందర్పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : స్వరాష్ట్రం కోసం 1969 లో తెలంగాణ సమాజం, విద్యార్ధిలోకం ఆనాడు ఉద్యమాలు చేసిందని ఎంపీ ఈటెల రాజేందర్పేర్కొన్నారు. అప్పడు కాంగ్రెస్ప్రభుత్వం 369 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకుందని, ఆ విద్యార్థుల త్యాగ ఫలితంగా సిక్స్‌పాయింట్ ఫార్ములాలో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు జరిగిందన్నారు. బుధవారం డిల్లీ తెలంగాణభవన్‌లో నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ విశ్వవిద్యాలయం కోసం 2500 ఎకరాల భూమిని కేటాయించారని, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు అమ్మకపోతే ఒక్క రోజు కూడా ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి లేదని చెప్పి యూనివర్సిటీ భూములు అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 400 ఎకరాలు రూ. 40 వేల కోట్లకు అమ్మి సర్కారు నడపాలనే సిగ్గుమాలిన పనికి రేవంత్ రెడ్డి సర్కార్ ఒడిగట్టిందన్నారు. యూనివర్సిటీ అధికారులు విద్యార్థులు ఈ అమ్మకానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. హెచ్ సి యు ను ప్రపంచ ప్రసిద్ధిగాంచిన యూనివర్సిటీ గా తయారు చేయాలని ఆశపడుతున్నారు.
ఒకపక్క ప్రభుత్వ ఆసుపత్రులు, స్కూళ్లు కట్టడానికి కనీసం స్మశాన వాటికలకు కూడా హైదరాబాదులో స్థలం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారవద్దు కాంక్రీట్ జంగిల్ గా హైదరాబాదును చేయవద్దని విద్యార్థులు మొక్కవోని ధైర్యంతో ఆందోళన చేస్తుంటే వారి మీద ప్రభుత్వం పోలీసుల్ని ఉసిగొల్పి దాడులు చేసి విద్యార్థుల రక్తం కళ్ల చూస్తున్నారని మండిపడ్డారు.వందల బుల్డోజర్లతో చెట్లను కూల్చివేసి పర్యావరణాన్ని నాశనం చేయడం మానుకోవాలన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు మద్దతు పలుకుతూ భూములు కాపాడాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. వారికి సంఘీభావంగా తాము ఢిల్లీలో ఆందోళన చేశామని తెలిపారు. భూముల రక్షణకు బీజేపీ అండగా ఉంటుందని, పార్టీ యావత్తు విద్యార్థులకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.






