రేవంత్ రెడ్డి కాదు మా అభ్యర్థి నిన్ను ఓడిస్తారు.. హరీశ్ రావుకు కాంగ్రెస్ కౌంటర్

by Prasad Jukanti |   (  Updated:2026-03-26 06:39:07  IST  )

సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు విసిరిన సవాల్‌పై కాంగ్రెస్ విప్‌లు ఆది శ్రీను, వేముల వీరేశం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి కాదు మా అభ్యర్థి నిన్ను ఓడిస్తారు.. హరీశ్ రావుకు కాంగ్రెస్ కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సిద్దిపేటలో నాపై పోటీ చేయాలి అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) చేసిన సవాల్‍కు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. హరీశ్‍రావు చిట్ చాట్ పేరిట బడాయి కబుర్లు, సొల్లు కబుర్లు చెబుతున్నారని ప్రభుత్వ విప్‍లు ఆది శ్రీను, వేముల వీరేశం ఫైర్ అయ్యారు. దమ్ముంటే రేవంత్ రెడ్డిని సిద్దిపేటకు వచ్చి పోటీ చేయమని మాట్లాడుతున్నారు. సిద్దిపేటలో రేవంత్ రెడ్డి కాదు, వారు బి-ఫాం ఇచ్చిన అభ్యర్థి రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొడుతారని ఆదిశ్రీను జోస్యం చెప్పారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ సిద్దిపేటలో (Congress) రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. తలకిందులు తపస్సు చేసిన మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాదని, కేసీఆర్ ముఖ్యమంత్రి కారన్నారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‍గా మారిన రోజే ప్రజలు మీ పార్టీని ఫాం హౌస్ కు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు.

పిచ్చి పిచ్చి కామెంట్లు మానుకో..

హరీశ్ రావు చిట్ చాట్ పేరుతో ఏవేవేవో మాట్లాడుతున్నారని వేముల వీరేశం విమర్శించారు. రేవంత్ రెడ్డి మిమ్మల్ని గద్దె దించుతాం అని చెప్పి మరీ గద్దె దించారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మిమ్మల్ని సున్నాకి పరిమితం చేస్తామని చేసి చూపిన దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. మీ పార్టీ అధ్యక్షుడు ఏక్కడా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి వస్తున్న ఆదరణ చూసి, ఎదుగుతున్న తీరు జీవించుకోలేక హరీశ్ రావు అక్కసుతో మాట్లాడుతున్నారని ఇకనైనా పిచ్చి పిచ్చి కామెంట్లు మానుకోవాలని హెచ్చరించారు.

రాష్ట్రానికి రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు.. దావోస్ పర్యటనపై సభలో మంత్రి శ్రీధర్ బాబు

Next Story