Congress: మున్సిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టిన కాంగ్రెస్.. పలువురు అభ్యర్థులు విజయం

by Kema Shiva Kumar |

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ బోణీ కొట్టింది. ములుగు, కొల్లాపూర్, ఇంద్రేశం వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించి పార్టీ ఖాతా తెరిచారు.

Congress: మున్సిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టిన కాంగ్రెస్.. పలువురు అభ్యర్థులు విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ విజయాలతో బోణీ కొట్టింది. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలోని 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిత విజయం సాధించారు. ములుగు మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఆలోతు పద్మ 278 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నరసింహారావు 150 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు.

Next Story