- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KCR: రేపటి నుంచే అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్ పై స్పీకర్ కు కాంగ్రెస్ ఫిర్యాదు
కేసీఆర్ పై స్పీకర్ కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న వేళ అధికార కాంగ్రెస్ (Congress) వర్సెస్ బీఆర్ఎస్ (BRS) మధ్య రాజకీయం ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ఈ క్రమంలో తాజాగా ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) పై కాంగ్రెస్ నేతలు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు (Gaddam Prasad Kumar) ఫిర్యాదు (Complaint against KCR) చేశారు. కేసీఆర్ వేతనం నిలిపివేయాలని ప్రతిపక్ష నేతగా జీత భత్యాలు పొందుతూ కేసీఆర్ శాసన సభకు రావడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ప్రజల అభ్యున్నతి కోసం విధులను శ్రద్ధగా నిర్వహిస్తారని తెలంగాణ ప్రజలమైన మా పన్నులతో ప్రతిపక్ష నాయకుడితో సహా ఎన్నికైన ప్రజాప్రతినిధుల జీతభత్యాలు చెల్లింపులు చేస్తారు. కానీ కేసీఆర్ అసెబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదు. తద్వారా ప్రతిపక్ష నేతలగా తన బాధ్యతలను విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రభుత్వ విధానాలకు జవాబుదారీతనం, నిర్మాణాత్మక విమర్శలు, ప్రత్యామ్నాయ పరిష్కారాలకు కీలకం. కేసీఆర్ (KCR) సభకు రాకుండా చర్చల్లో పాల్గొనకుండా తనకు అప్పగించిన ఈ ముఖ్యమైన పాత్రను విస్మరించడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని పేర్కొన్నారు. అందువల్ల కేసీఆర్ తన విధులు, బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించేవరకు ఆయన జీతభత్యాల విషయంలో స్పీకర్ పునరాలోచన చేయాలని కోరారు.






