- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gandhi Bhavan: కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో గాంధీభవన్‌లో కాంగ్రెస్ సంబరాలు
దేశవ్యాప్తంగా జనాభా లెక్క లతోపాటు కులగణనను చేపట్టాలని మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా జనాభా లెక్క లతోపాటు కులగణనను చేపట్టాలని (Modi government) మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కులగణనకు విపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో బుధవారం జరిగిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీలో జనాభా లెక్కలతోపాటే (caste census) కులగణనను నిర్వహించాలని తీర్మానించారు. దీనిపై కులగణన నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేథ్యంలోనే గరువారం (Gandhi Bhavan) గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతల సంబరాలు నిర్వహించారు. టపాసులు కాలుస్తూ, డప్పు చప్పుళ్లకు స్టెప్పులు వేస్తూ కాంగ్రెస్ నేతలు సందడి చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
కులగణనలో తెలంగాణ మోడల్‌ను ఫాలో అవ్వాలని రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కాంగ్రెస్ శ్రేణులు గుర్తుకు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని, కుల గణనపై కేంద్రం నిర్ణయం తీసుకునేలా దేశ వ్యాప్తంగా చర్చ జరిగేలా, చేసిన రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి, దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి, మొదటగా కుల గణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి వారు కృతజ్ఞతలు తెలిపారు. వీలైనంత త్వరగా కేంద్రం ప్రభుత్వం కుల గణన చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులు విజ్ఞప్తి చేశాయి.
ఇదిలా ఉండగా.. కుల గణన పై కేంద్రం నిర్ణయం తో రాహుల్ సంకల్పం సిద్ధించిందని టీపీసీసీ చీఫ్ మహేశ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం కుల గణనను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించిందని అన్నారు. శాసన సభలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల సాక్షిగా ఏకగ్రీవ తీర్మానంతో బీసీ కుల గణనకు చట్ట బద్దత కల్పించినట్లు తెలిపారు. బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లో బీసీ 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని 50 శాతం రిజర్వేషన్లు పరిమితి ఎత్తివేసేలా పార్లమెంట్ లో చట్టం చేయాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.






