- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో : ఓట్ చోరీ అంశంపై ఢిల్లీలో నేడు ఏఐసీసీ చేపట్టిన మహాధర్నాకు పెద్ద ఎత్తున తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు తరలివెళ్లారు. ఒంటి గంటకు ఢిల్లీకి చేరుకునే విధంగా నాయకులు కార్యకర్తలు ప్రణాళిక చేసుకోవాలని టీపీసీసీ వారికి సూచించింది. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటు చోరీ పైన తెలంగాణలో పెద్ద ఎత్తున సంతకాలను నేతలు సేకరించారు. ఈ ఓటు చోరీ కార్యక్రమాన్ని సమన్వయం చేసేందుకు ఏడుగురితో టీపీసీసీ ఓట్ చోర్ గద్ది చోడ్ కో ఆర్డినేషన్ కమిటీని నియమించింది. ఈ కమిటీకి చైర్మన్ గా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని నియమించారు. ఆయన నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెలంగాణ నుంచి సేకరించిన దాదాపు పది లక్షలకు పైగా సేకరించిన సంతకాల ఫామ్ లను ప్రత్యేక వాహనంలో గాంధీ భవన్ నుంచి రెండు రోజుల క్రితమే ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయానికి కాంగ్రెస్ నేతలు పంపారు.
కాగా, ఓటు చోరీపైన ఒకే అడ్రస్ లో భారీగా ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, ఫేక్ అడ్రస్, ఫామ్ 6, ఇన్ వ్యాలిడ్ ఫోటోలు వంటి అంశాలతో ఓటును దుర్వినియోగం పరుస్తూ ఓట్ల చోరీ జరుగుతుందన్న ఆరోపణలతో కాంగ్రెస్ నేతలు ఈ ఓటు చోరీ నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఓట్ చోరీపై సెప్టెంబర్ నుంచి సంతకాల ఉద్యమం కాంగ్రెస్ ఆరంభించింది. కర్ణాటక కాంగ్రెస్ ఒక కోటి పన్నెండు లక్షలు, పంజాబ్ నుంచి ఇరవై ఏడు లక్షల సంతకాలను సేకరణను జరిపారు. ఇక ఇతర రాష్ట్రాల్లోనూ సంతకాల సేకరణను హస్తం నేతలు నిర్వహించారు. ఇటు తెలంగాణలోనూ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ అనేక సార్లు సమావేశాలు నిర్వహించి సంతకాల సేకరణను సమన్వయ పరిచారు. ఈ సేకరించిన సంతకాలతో రామ్‌లీలా మైదానంలో భారీ ర్యాలీని నిర్వహించిన అనంతరం రాష్ట్రపతిని కలిసి ఓటు చోరీ అంశంపై వినతి పత్రం ఇవ్వాలని కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టింది. కాగా, ఢిల్లీ నిరసన కార్యక్రమానికి మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. మరోవైపు పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటు చోరీ అంశాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులను కోరారు.






