- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congress vs BRS: గ్రామసభలో కాంగ్రెస్..బీఆర్ఎస్ బాహాబాహీ
ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభ(Gram Sabha)లు పలు చోట్ల రసాభాసగా మారుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభ(Gram Sabha)లు పలు చోట్ల రసాభాసగా మారుతున్నాయి. అర్హులైన వారిని ఎంపిక చేయడం లేదని, పైరవీలు చేసిన వారికి, పార్టీ కార్యకర్తలనే లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నారన్న కారణాలతో కొన్ని చోట్ల, రాజకీయ కారణాలతో మరికొన్ని చోట్ల గ్రామసభలు వివాదాలతో సాగుతున్నాయి.
వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గం వడ్లకొండ గ్రామ సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ(Congress vs BRS)కార్యకర్తల మధ్య నెలకొన్న వాగ్వివాదం పరస్పరం దాడులకు దారితీసింది. ఇరువర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. లబ్ధిదారుల ఎంపిక..పథకాల తీరును ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. దీంతో పరస్పరం దాడి చేసుకున్న కాంగ్రెస్ , బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టి అక్కడి నుండి పంపించి వేశారు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో సంక్షేమ పథకాల ఎంపిక పేరుతో నిర్వహిస్తున్న గ్రామ సభలు ఘర్షణలు రేకేత్తిస్తున్నాయని పలువురు ఆరోపించారు.






