- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kothagudem Corporation: కాంగ్రెస్, సీపీఐ ఎప్పటికీ విడిపోవు: సీతక్క
తెలంగాణ రాజకీయాల్లో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. హంగ్ పరిస్థితుల్లో సీపీఐకు మేయర్ పదవి ఇవ్వడానికి బీఆర్ఎస్ సిద్ధమవగా, కాంగ్రెస్–సీపీఐ పొత్తుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలపై చర్చ జరుగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కొత్తగూడెం కార్పొరేషన్ (Kothagudem Corporation) మేయర్ పోస్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ హంగ్ రావడంతో మేయర్ పోస్టును సీపీఐకి ఇచ్చేందుకు బీఆర్ఎస్ (BRS) సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సీపీఐ (CPI), కాంగ్రెస్ (Congress) పొత్తుపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ మంత్రి సీతక్క (Seethakka) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, సీపీఐ ఎప్పటికీ విడిపోవన్నారు. స్థానిక నాయకత్వంలో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని కూటమిగా రెండు పార్టీలు కలిసి ఉంటాయన్నారు. ఇవాళ హైదరాబాద్‍లో ఓ న్యూస్ చానల్‍తో మాట్లాడిన సీతక్క.. కాంగ్రెస్, సీపీఐ మధ్య జాతీయ స్థాయిలో పొత్తు ఉందన్నారు.
నాది అదే పరిస్థితి:
పార్టీలో రెబల్స్ పై స్పందించిన సీతక్క.. పార్టీలో కొంత మేర రెబల్స్ బెడద ఉందని నాకు కూడా ఆ పరిస్థితి తప్పలేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 80 గెలుచుకుందని ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో ఇది గొప్ప విజయం. ఎన్నికల్లో డబ్బుల సంస్కృతి బీఆర్ఎస్ దేనని విమర్శించారు. కాగా కొత్తగూడెం కార్పోరేషన్ ఎన్నికల ఫలితాల్లో మేయర్ పీఠం దక్కించుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 31 స్థానాలు ఏ పార్టీకి రాలేదు. కాంగ్రెస్, సీపీఐకి ఇక్కడ చెరో 22 డివిజన్‍లు దక్కగా బీఆర్ఎస్‍కు 8 దక్కాయి. దీంతో మేయర్ పోస్టును బీఆర్ఎస్ సీపీఐకి అన్ కండిషనల్‍గా ప్రకటించింది. బీఆర్ఎస్ మద్దతుపై ఇవాళ సీపీఐ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, సీపీఐ పొత్తులపై సీతక్క చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్ గా మారాయి.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం:
కాగా కొత్తగూడెం కార్పొరేషన్‍ను సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో స్థానిక మంత్రులతో సీఎం చర్చించినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో మేయర్ ఎంపిక నాటికి ఇక్కడ రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే సీపీఐకి మద్దతు రూపంలో కార్పొరేషన్ పై పైచేయి సాధించాలని బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తున్న వేళ సీఎం ఎలాంటి ట్విస్ట్ ఇస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.






