- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సామాజిక న్యాయానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్.. అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ చీఫ్
సామాజిక న్యాయానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ (Congress Party) అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: సామాజిక న్యాయానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ (Congress Party) అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు (MLC Elections) కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసిన పార్టీ అభ్యర్థులకు (Congress Candidates) బీ ఫామ్ (B -Form) లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) సహా మంత్రులు (ministers) ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు (congress Leaders) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మూల సిద్దాంతంలోనే సామాజిక న్యాయం (Social Justice) ఉన్నదని తెలిపారు. కాంగ్రెస్ తోనే కులగణన (Caste Census), ఎస్సీ వర్గీకరణ (SC classification) సాధ్యమైందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ రెడ్డిని సీఎం చేస్తే.. టీపీసీసీ అధ్యక్ష పదవి బీసీకి ఇచ్చారని తెలిపారు. అలాగే ఇప్పుడు మూడు ఎమ్మెల్సీ స్థానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళకు ఇచ్చిందని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా అవకాశాలు దక్కుతాయని, ఏ అవకాశం అయినా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యం ఉంటుందని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. కాగా తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏఐసీసీ (AICC) ఆదివారం అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురికి అవకాశం దక్కగా.. మరొకటి మిత్రపక్షమైన సీపీఐ (CPI) కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన అద్దంకి దయాకర్ (Addanki Dayakar), కేతావత్ శంకర్ నాయక్ (Kethavath Shankar Naik), విజయశాంతి (VijayaShanthi)లు సోమవారం బీ ఫామ్ అందుకొని, నామినేషన్ (Nomination) పత్రాలు దాఖలు చేశారు.






